ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-07-31T02:42:59+05:30 IST

ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. స్టేట్ స్పోర్ట్స్ కోటాలో

ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు ఉత్తర్వులు

అమరావతి: ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. స్టేట్ స్పోర్ట్స్ కోటాలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారిని సైతం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును పిటిషనర్ వెంకట శివబాలాజీ ఆశ్రయించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిని మాత్రమే స్పోర్ట్స్ కోటాలో పరిగణలోకి ఏపీపీఎస్సీ తీసుకుంటోదని పిటిషనర్ ఆరోపించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారిని సైతం పరిగణలోకి తీసుకొని స్పోర్ట్స్ కోటా వర్తింప జేయాలని హైకోర్టు పేర్కొంది. స్టేట్ కోటాలో పిటిషనర్ నియామకం చేపట్టాలని న్యాయమూర్తి అన్నారు. యాక్టు ప్రకారం జీఓ ఉండాలి కానీ, జీఓ ప్రకారం యాక్టు న్యాయమూర్తి డివియస్ సోమయాజులు ఉండదన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బండారు ఆదినారాయణ, న్యాయవాది యాలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-07-31T02:42:59+05:30 IST