Abn logo
Sep 24 2021 @ 15:25PM

ముండ్లమూరు మండల పరిషత్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిషత్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. గెలిచిన ఆరుగురికి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎంపీటీసీలు కలెక్టర్ దగ్గరకెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదని కోర్టుకు లాయర్ తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎన్నికలు జరపొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీపీ, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక డిక్లరేషన్ ఇచ్చాకే జరపాలని కోర్టు ఆదేశించింది. దర్శిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తమకు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆరుగురు ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. 

ఇవి కూడా చదవండిImage Caption