Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్‌ కూల్చివేతను ఆపండి: హైకోర్టు

విశాఖ: మిందిలో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్‌ కూల్చివేతను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతధస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రైవేట్ గోడౌన్‌ను రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు కూల్చివేశారు. అనుమతి లేని నిర్మాణాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని గోడౌన్ యజమానులు అంటున్నారు. మిందిలో ఏపీఐఐసీకి చెందిన స్థలాన్ని గతంలో రాయుడు అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. అతని నుంచి అతని కుమారుడు అవినాష్ నుంచి కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం లీజుకు తీసుకుంది. బుధవారం అధికారులు ఎవరిని లోపలకు అనుమతించకుండా కూల్చివేశారు.


Advertisement
Advertisement