Abn logo
Jul 1 2020 @ 02:56AM

విదేశీ తబ్లిగీల తరలింపునకు హైకోర్టు అనుమతి

నిజాముద్దీన్‌ మర్కజ్‌వద్ద మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న 65 మంది విదేశీ తబ్లిగీ జమాత్‌ సభ్యులను ప్రత్యామ్నాయ వసతికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అనుమతించింది. వారిని ప్రత్యామ్నాయ వసతికి తరలించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు ప్రకటించిన దరిమిలా ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం తాము ఉంటున్న ఆవరణ అపరిశుభ్రంగా ఉందని, మరో చోటుకు మార్చాలంటూ వారు దాఖలు చేసుకున్న వ్యాజ్యంపై ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. 


Advertisement
Advertisement
Advertisement