శశికళకు కర్నాటక హైకోర్టు షాక్

ABN , First Publish Date - 2020-12-05T22:19:59+05:30 IST

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను

శశికళకు కర్నాటక హైకోర్టు షాక్

చెన్నై : అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. జనవరి మాసంలో ఆమెకు జైలు నుంచి విముక్తి కలగనుందని వార్తలొచ్చాయి. ఈ వార్త తమిళ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. హఠాత్తుగా కర్నాటక హైకోర్టు ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె శిబిరం డీలా పడిపోయింది. కొన్ని రోజుల క్రితమే తన శిక్షా కాలాన్ని తగ్గించాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును పరప్పన అగ్రహార జైలు అధికారులు ఉన్నతాధికారులకు కూడా పంపించారు. 

Updated Date - 2020-12-05T22:19:59+05:30 IST