గ్రంధాలయ చైర్మన్‌ల నియామకంపై హైకోర్టు స్టేటస్‌కో

ABN , First Publish Date - 2021-07-25T03:19:55+05:30 IST

గ్రంధాలయ చైర్మన్‌ల నియామకంపై హైకోర్టు స్టేటస్‌కో

గ్రంధాలయ చైర్మన్‌ల నియామకంపై హైకోర్టు స్టేటస్‌కో

అమరావతి: ఏపీ గ్రంధాలయ రాష్ట్ర చైర్మన్‌, జిల్లా చైర్మన్‌ల నియామకంపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. గడువు ఉండగనే తమను పదవి నుంచి తొలగించారని పిటిషనర్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నియామకం పొందిన గ్రంధాలయ రాష్ట్ర చైర్మన్ రాజు మాస్టారు హైకోర్టును ఆశ్రయించారు. 12 జిల్లాల గ్రంధాలయ చైర్మన్‌లు తొలగింపు అక్రమమని, గ్రంధాలయ చైర్మన్‌లుగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ప్రభుత్వంపై పిటిషన్ వేయడంతో గ్రంధాలయ చైర్మన్లు తొలగింపబడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. గ్రంధాలయ చైర్మన్ల నియామకంపై  హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్‌ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2021-07-25T03:19:55+05:30 IST