కోటి రూపాలయలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు వ్యవస్థాపక ట్రస్టీలనే కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మధ్యంతర స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చారిటబుల్, హిందూ రిలిజియస్ సంస్థల వ్యవస్థాపక ట్రస్టీల అసోసియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శికి, కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.