మూడు వారాలు నిలిచిపోనున్న మద్యం హోం డెలివరీ

ABN , First Publish Date - 2020-04-02T22:53:36+05:30 IST

మందుబాబుల ఆశలపై కేరళ హైకోర్టు నీళ్లు చల్లింది. కరోనా బారిన పడి కోలుకుంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ కలిగి ఉన్న వారికి ఇంటికే మద్యాన్ని అందించే విధంగా...

మూడు వారాలు నిలిచిపోనున్న మద్యం హోం డెలివరీ

తిరువనంతపురం: మందుబాబుల ఆశలపై కేరళ హైకోర్టు నీళ్లు చల్లింది. కరోనా బారిన పడి కోలుకుంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ కలిగి ఉన్న వారికి ఇంటికే మద్యాన్ని అందించే విధంగా కేరళ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని అమలును మూడు వారాల పాటు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే విధించింది. ఈ విధానం గందరగోళంగా ఉందని, ఇలా ఇంటికి మద్యం అందించడం అంత మంచిది కాదని హైకోర్టు బెంచ్ పేర్కొంది. 


ఇదిలా ఉంటే కేరళ సీఎం పినరయ్ విజయన్ మాట్లాడుతూ, పేషెంట్లకు మద్యం ప్రిస్క్రైబ్ చేయమని తాము ఏ డాక్టర్‌ పైనా ఒత్తిడి చేయడం లేదని, ఎవరైతే మద్యం లేకపోతే తట్టుకోలేని స్థితిలో ఉంటారో వారికే ప్రిస్క్రైబ్ చేయమని స్పష్టమైన ఉత్తర్వులిచ్చామని అన్నారు. మద్యం లభించకపోవడం వల్ల కొందరు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మద్యం షాపులు మూసివేసి వారం రోజులు అయిందని, ఇప్పటికైనా మద్యం వ్యసనపరులు రిహాబిలిటేషన్ సెంటర్లకు వెళ్లేలా వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజయన్ సూచించారు.

Updated Date - 2020-04-02T22:53:36+05:30 IST