Telangana: యాసంగి వరి వెయ్యొద్దన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2021-11-02T17:07:07+05:30 IST

యాసంగి వరి వెయ్యొద్దంటూ సిద్దిపేట కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

Telangana: యాసంగి వరి వెయ్యొద్దన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: యాసంగి వరి వెయ్యొద్దంటూ సిద్దిపేట కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. బాతుల నారాయణ అనే వ్యక్తి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.


పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు... కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం విచారణకు నేరుగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు చెప్పినా వినను అన్న వ్యాఖ్యలను పిటిషనర్ తరుపు న్యాయవాది నరేష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు మరోసారి వాదనలు జరుపనుంది. 

Updated Date - 2021-11-02T17:07:07+05:30 IST