Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైకోర్టు తీర్పు దురదృష్టకరం: సజ్జల

అమరావతి: పరిషత్ ఎన్నికలు గతేడాది కరోనాతో వాయిదా పడ్డాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ యజ్ఞంలా పరిషత్ ఎన్నికలు పూర్తిచేశామని చెప్పారు. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు దురదృష్టకరమన్నారు. డివిజన్ బెంచ్ తీర్పుతోనే ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పటి నుంచే ఈ దాగుడుమూతలు మొదలయ్యాయని సజ్జల విమర్శించారు. ఏ ఉద్దేశాలతో కోర్టులకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏదో ఒకవిధంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement