ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-07-20T06:20:43+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేసి పేదలను పీడీస్తున్నారని ఏబీవీపీ జిల్లా ఉపకార్యదర్శి ఎన్‌.వినయ్‌ అన్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలి
పిడికిటిపల్లి నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

పుల్లలచెరువు, జూలై 19: రాష్ట్ర వ్యాప్తంగా  ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేసి పేదలను పీడీస్తున్నారని ఏబీవీపీ జిల్లా ఉపకార్యదర్శి ఎన్‌.వినయ్‌ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పుల్లలచెరువు మండలంలో పాఠశాలల్లో బంద్‌ చేశారు.  ఈ సందర్భంగా వినయ్‌ మాట్లాడుతూ ఓ వైపు కార్పొరేట్‌ను కట్టడి చేస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపితం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు, పుస్తకాల ధరలు, ఏక రూప దుస్తుల పేరుతో  దోపీడీ చేస్తుంటే ప్రభుత్వం ఏందుకు మోనంగా  ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పేరుతో నాడు-నేడులో దోచుకోని నేడు పాఠశాలను వీలీనం పేరుతో గాలికి వదిలేశారని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రంను పాఠశాల హెచ్‌ఎం కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి మండల కార్యదర్శి ఏసుబాబు, ఎంపీటీసీ వెంగయ్య, అచ్చయ్య, పుల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : రాష్ట్రంలో బ్రాండ్‌ పేరుతో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఏబీవీపి జిల్లా కన్వీనర్‌ టి.శ్రీకాంత్‌ అన్నారు. ఏబీవీ పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాఠశాలల సమస్యలపై పట్టణంలో మంగళ వారం పాఠశాలల బంద్‌ నిర్వహించారు. 

Updated Date - 2022-07-20T06:20:43+05:30 IST