మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-22T05:56:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మహిళ ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డు ల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శుక్రవారం పంపి ణీ చేసి ఆయన మాట్లాడారు.

మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
జిల్లా కేంద్రంలో ఆక్రమణలకు గురైన నాలాలను పరిశీలిస్తున్న మంత్రి

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం మహిళ ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డు ల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శుక్రవారం పంపి ణీ చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లి పేదింట్లో భారం కాకూడదని, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 అందజేస్తోందని తెలిపారు. ఆడపిల్లల పరిరక్షణకు ప్రత్యేకంగా షీటీంల ను ఏర్పాటు చేశామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా పాలన సాగడంలేదని మండిపడ్డారు. గణతంత్ర వేడుకల శకటాల ప్రదర్శణలో రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. మొత్తం తొమ్మిది వార్డుల్లో రూ.26,03,000 విలువైన చెక్కులను అం దజేశారు. అంతకుముందు మంత్రి జగదీ్‌షరెడ్డిని ఆత్మకూర్‌(ఎస్‌) మండ ల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు : మంత్రి

పట్టణంలో అక్రమంగా నాలాలు ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని  మంత్రి జగదీ ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 13, 14వ వార్డుల్లో పర్యటించి నాలా అక్రమణలను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలతోపాటు కాలనీల్లోకి నీరు చేరిందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-22T05:56:00+05:30 IST