దంచికొడుతున్న వానలు

ABN , First Publish Date - 2020-08-12T10:30:19+05:30 IST

వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం కారణంగా వారం రోజులుగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోస్తరు

దంచికొడుతున్న వానలు

పాలమూరు జిల్లాలో 85 శాతం

అధిక వర్షపాతం నమోదు

అలుగు పారుతున్న చెరువులు

జలకళను సంతరించుకున్న చెక్‌డ్యామ్‌లు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం కారణంగా వారం రోజులుగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే జిల్లా లో 85.64 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, 274.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 510.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


దుందుభీ, పెద్దవాగు, ఊకచెట్టువాగు పొంగుతున్నాయి. వీటిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని 1,203 చిన్నా, పెద్ద చెరువులు నిండి, అలుగు పారుతున్నాయి. 2.50 టీఎంసీల సామర్థ్యం గల కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో కాల్వలకు నీరందుతోంది. అలాగే బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. దీంతో వీటి కింద వ్యవసాయం ఊపందుకుంది. 


Updated Date - 2020-08-12T10:30:19+05:30 IST