Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగ్గయ్యపేటలో హై టెన్షన్

కృష్ణా: జగ్గయ్యపేటలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీకి 8 వార్డులు అనుకూలంగా రావడంతో వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా జగయ్యపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వైసీపీ నేతల యత్నిస్తున్నారు. అలజడి సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే 13 వార్డులో వైసీపీ నేతలు రెండు సార్లు రీకౌంటింగ్ చేయించారు. జగయ్యపేటకు పోలీసు అదనపు బలగాల తరలించారు. జగయ్యపేటలో స్వయంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ మానిటరింగ్ చేస్తున్నారు. 


జగ్గయ్యపేటలో కౌంటింగ్ కేంద్రం తలుపులను అధికారులు మూసి వేశారు. జగ్గయ్యపేట ఓట్ల లెక్కింపు సందర్భంగా 4,13 వార్డుల్లో రీకౌంటింగ్ చేయాలని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్‌కు స్థానిక అధికారుల తిరస్కరించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైసీపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్, అతని అనుచరులు ప్రయత్నించారు. వైసీపీ నేతలను  పోలీసులు అడ్డుకున్నారు. కౌంటింగ్ కేంద్రం తలుపులను పోలీసులు మూసి వేశారు. జగ్గయ్యపేటలోని 4, 13 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు నోటీసు బోర్డులో కూడా అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం వైసిపి ఒత్తిడి చేస్తుండటంతో నోటీసు బోర్డును తొలగించేందుకు ప్రయత్నించారు. 


ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోలింగ్ వరకూ ఓ లెక్క అయితే.. కౌంటింగ్ రోజు సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీ ఓడిన చోట రీ కౌంటింగ్‌ చేసి గెలవాలని విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటి వరకూ ఇలా రీ కౌంటింగ్ చేసి ఒకట్రెండు చోట్ల గెలిచింది కూడా. మరికొన్ని చోట్ల పట్టుబట్టి మరీ రీ కౌంటింగ్ చేయించి వైసీపీ పరువు పోగొట్టుకుంది.

Advertisement
Advertisement