విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-11-09T18:33:14+05:30 IST

పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు...

విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

అనంతపురం: పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. అయితే పోలీసులు ర్యాలీను అడ్డుకున్నారు. దీంతో అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. క్షణం.. క్షణం.. ఈ టెన్షన్ మరింత పెరుగుతోంది. పోలీసుల లాఠీ చార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొంటున్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. దీంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు.


అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు మంగళవారం బంద్‌కు పిలుపు ఇచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తరలించారు. మరోవైపు నిన్న లాఠీ  చార్జ్‌లో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీంతో తోటి విద్యార్థులు, బంధువులు ఆందోళనలో పాల్గొన్నారు. అటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. కాగా ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ యాజమాన్యం ఇవాళ, రేపు సెలవు ప్రకటించింది. 

Updated Date - 2021-11-09T18:33:14+05:30 IST