Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 4: అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి పేర్కొన్నారు. అమెరికాలో విద్యా ఉపాధి అవకాశాలు అంశంపై తిరుపతిలోని సిటీ చాంబర్‌ ఆధ్వర్యంలో ఎస్వీయూనివర్సిటీ సెనేట్‌ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనేక దశాబ్దాలుగా తానా ఆధ్వర్యంలో క్యాన్సర్‌, కిడ్నీ, హృదయ, నేత్ర అంశాల్లో సంపూర్ణ ఆరోగ్య సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో విద్యా ఉపాధి కోసం వస్తున్న తెలుగు వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తోడ్పడ్డామన్నారు. ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ కె. రాజారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో విద్యా ఉపాధి అవకాశాలపై చేపట్టిన ఈ కార్యక్రమం యూనివర్సిటీ విద్యార్థులకు చాలా ఉపయోగకరమన్నారు.  దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో అవగాహన పొందారని తెలిపారు. అనంతరం అంజయ్య చౌదరి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, తుడా వీసీ సూర్యదేవర హరికృష్ణ, నిర్వాహకులు అయూబ్‌ఖాన్‌, షణ్ముగం యాదవ్‌, అధికారులు,  పాల్గొన్నారు.

Advertisement
Advertisement