ఉన్నత విద్య అభ్యసించే స్వేచ్ఛ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-25T04:36:28+05:30 IST

అమ్మాయిలకు ఉన్నత విద్యను అభ్యసించే స్వేచ్ఛను ఇవ్వాలని వైవీయూ వీసీ సూర్యకళావతి అన్నారు.

ఉన్నత విద్య అభ్యసించే స్వేచ్ఛ ఇవ్వాలి
వెబ్‌నార్‌ ద్వారా మాట్లాడుతున్న వీసీ సూర్యకళావతి

వెబ్‌నార్‌ సదస్సులో వీసీ సూర్యకళావతి

కడప (వైవీయూ), జనవరి 24: అమ్మాయిలకు ఉన్నత విద్యను అభ్యసించే స్వేచ్ఛను ఇవ్వాలని వైవీయూ వీసీ సూర్యకళావతి అన్నారు. సోమవారం అనంతపురం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా భేటీ బచావో, భేటీ పడావో పేరుతో వెబ్‌నార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ సూర్యకళావతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ బాలికల దినోత్సవం ప్రతియేటా జనవరి 24న నిర్వహించేలా నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి కుటుంబం బాలికలను చదివించాలని అన్నారు. స్త్రీలు విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతుల కుటుంబం అవుతుందని అన్నారు. అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ రంగ జనార్ధన, రెక్టార్‌ ప్రొఫెసర్‌ జయకుమార్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌, రీసోర్స్‌ పర్సన్‌ చైల్డ్‌లైన్‌ సమన్వయకర్త కృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు. 

Updated Date - 2022-01-25T04:36:28+05:30 IST