అధిక ఫీజులను నియంత్రించాలి

ABN , First Publish Date - 2021-06-24T07:03:32+05:30 IST

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, జీవో 46ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

అధిక ఫీజులను నియంత్రించాలి
సిరిసిల్ల జిల్లాకలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేవైఎం నాయకులు

 సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 23: ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, జీవో 46ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు  చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.  బుధవారం  కలెక్టరేట్‌ ఎదుట బీజేవైఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 శాతం ఫీజులను తగ్గించాలన్నారు.  ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌తో చాలామంది   ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, కళాశాలలు ఫీజులను పెంచాయని మండిపడ్డారు.  అనంతరం కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు వినతి పత్రం అందజేశారు.   కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జింక అనిల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు బూర విష్ణువర్ధన్‌, మాంకాళి శ్రీనివాస్‌, పట్ణణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్‌, వంగ అనిల్‌గౌడ్‌, చారి, ఈర్లపల్లి హరీష్‌, పిట్టల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T07:03:32+05:30 IST