సాంకేతిక విద్యతో ఉన్నత భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-10-24T06:09:17+05:30 IST

సాంకేతిక విద్యలో నైపుణ్యం ఉన్న వారికి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అడిషినల్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు.

సాంకేతిక విద్యతో ఉన్నత భవిష్యత్తు
విద్యార్థులకు డిగ్రీ పట్టా అందిస్తున్న అడిషినల్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌

అడిషినల్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 23: సాంకేతిక విద్యలో నైపుణ్యం ఉన్న వారికి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అడిషినల్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం 12వ స్నాతకోత్సవం జరిగింది. 2020-21 సంవత్సరంలో బీటెక్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచీకరణలో ఆధునిక అభివృద్ధి పరంగా యువత పయనించాల్సిన అవసరం ఉందన్నారు. విజయనగరం జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.స్వామినాయుడు మాట్లాడుతూ, పరిశ్రమలకు ఉపయోగపడేలా విద్యలో మార్పులు వస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నత ఆశయాలతో ముందుకుస ఆగాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌.నరసింహం, వివిధ విభాగాధిపతులు సిహెచ్‌.ప్రభాకర్‌రావు, ప్రసన్నకుమార్‌, రామ్‌కుమార్‌, పూర్ణప్రియా, ఎ.కృష్ణనాథ్‌, ఎస్‌.రాము, ఎగ్జామ్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ ఎస్‌ఎన్‌ వర్మ, ఎ.కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:09:17+05:30 IST