‘కొత్త వంగడాలతో అధిక దిగుబడులు’

ABN , First Publish Date - 2021-02-25T05:42:18+05:30 IST

రైతులు కొత్తరకం వంగడాలతో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్‌చౌహాన్‌, ఏడీఏ పుల్లయ్యలు అన్నారు. బుధవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా శనగ పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు.

‘కొత్త వంగడాలతో అధిక దిగుబడులు’

ఆదిలాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 24: రైతులు కొత్తరకం వంగడాలతో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్‌చౌహాన్‌, ఏడీఏ పుల్లయ్యలు అన్నారు. బుధవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా శనగ పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగిలో వేసవిన ఎన్‌బీఈజీ 47 రకం శనగ పంట అధిక దిగుబడులు ఇచ్చిందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల పట్ల మొగ్గు చూపాలన్నారు. ఇందులో డీఎస్‌వో శివకువర్‌, ఏవో అస్రాఫ్‌, ఏఈవో ప్రసాద్‌, సర్పంచ్‌ మమత సతీష్‌రెడ్డి, రైతులు దామోదర్‌రెడ్డి, శ్రీవర్ధన్‌, నరేష్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, హారీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:42:18+05:30 IST