హిజాబ్‌ తొలగింపునకు విద్యార్థినుల నిరాకరణ

ABN , First Publish Date - 2022-02-17T17:27:09+05:30 IST

ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు తరగతులకు వచ్చే వారు హిజాబ్‌ తొలగించాలని అధికారులు చేసిన సూచనను కొంత మంది విద్యార్థినులు తిరస్కరించారు. బుధవారం నగరంలోని ఎస్‌ఎస్ఆర్‌జీ మహిళా డిగ్రీ కళాశాలకు

హిజాబ్‌ తొలగింపునకు విద్యార్థినుల నిరాకరణ

                     - కళాశాల నుంచి వెనుదిరిగిన వైనం


రాయచూరు(కర్ణాటక): ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు తరగతులకు వచ్చే వారు హిజాబ్‌ తొలగించాలని అధికారులు చేసిన సూచనను కొంత మంది విద్యార్థినులు తిరస్కరించారు. బుధవారం నగరంలోని ఎస్‌ఎస్ఆర్‌జీ మహిళా డిగ్రీ కళాశాలకు వచ్చిన విద్యార్థినులను హిజాబ్‌ తొలగించి తరగతి గదుల్లోకి రావాలంటూ అక్కడి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు సూచించడంతో వారు అందుకు నిరాకరించారు. తాము ఫీజులు చెల్లించి కళాశాలకు వస్తున్నామని, తమపై నిర్భంధమేమిటని విద్యార్థినులు వాగ్వాదానికి దిగారు. ఈ దిశలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకుడు బషీరుద్దీన్‌ విద్యార్థినులకు నచ్చజప్పి హిజాబ్‌ తొలగించేందుకు ప్రయత్నించినప్పటికి వారు అంగీకరించలేదు. హిజాబ్‌ ధరించడం తమ హక్కు అంటు విద్యార్థినులు నినాదాలు చేస్తూ కళాశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కాగా హిజాబ్‌ తొలగింపునకు సంబంధించి నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ చేసిన సూచనను కొంత మంది విద్యార్థినులు పాటించగా మరికొంత మంది కొద్ది సేపు వేచి ఉండి తమలో తాము చర్చించుకుని కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-02-17T17:27:09+05:30 IST