Abn logo
May 27 2020 @ 18:47PM

ఇంటికెళ్లడం కోసం రెండు టికెట్లు బుక్ చేసుకున్న నటుడు.. కారణమిదేనట!

ముంబై: తాను ఇంటికెళ్లడం కోసం రెండు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకున్నానని యాక్టర్ హిమాన్ష్ కోహ్లీ వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల ఇతరులతో కాంటాక్ట్‌లో రావడం జరగదని, అందుకే తాను ఈ పని చేశానని అతను చెప్పాడు. ఇటీవల జాతీయ విమానాలు నడిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న హిమాన్ష్ ఢిల్లీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం మిడిల్, విండో సీట్లు రెంటినీ తానే బుక్ చేసుకున్నట్లు చెప్పాడు. ‘ఇలా చేయడం వృధా అనిపించినా సరరే, మన జీవితం చాలా ముఖ్యమైనది కదా’ అని హిమాన్ష్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
Advertisement