కరోనా కథలో ట్విస్ట్.. అమెరికాలో దర్యాప్తుకు చైనా డిమాండ్!

ABN , First Publish Date - 2021-06-17T22:36:57+05:30 IST

మెరికాలో 2019 డిసెంబర్ ప్రారంభంలోనే కరోనా కేసులు వెలుగు చూసినట్టు అక్కడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్స్(ఎస్ఐహెచ్) సంస్థ చేపట్టిన అధ్యయనంలో బయటపడటంతో కరోనా కథ కీలక మలుపు తిరిగింది.

కరోనా కథలో ట్విస్ట్.. అమెరికాలో దర్యాప్తుకు చైనా డిమాండ్!

న్యూఢిల్లీ: అమెరికాలో 2019 డిసెంబర్ ప్రారంభంలోనే కరోనా కేసులు వెలుగు చూసినట్టు అక్కడి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్స్(ఎస్ఐహెచ్) సంస్థ చేపట్టిన అధ్యయనంలో బయటపడటంతో కరోనా కథ కీలక మలుపు తిరిగింది. ఈ నివేదికను ప్రస్తావించిన చైనా శాస్త్రవేత్త ఒకరు కరోనా పుట్టుకపై జరిగే తదుపరి దర్యాప్తును అమెరికాలోనూ చేపట్టాలని కోరారు. అమెరికా ఎన్ఐహెచ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దేశంలో కరోనా తొలి కేసు రికార్డుల్లోకి ఎక్కకమునుపే ఐదు రాష్ట్రాల్లో కనీసం ఏడు కరోనా కేసులు నమోదైయ్యాయి. తొలి కేసు రికార్డుల్లోకి నమోదవడానికి కొన్ని వారాల మునుపే అమెరికాలో కరోనా వ్యాప్తి ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. 


ఈ పరిమాణంపై  చైనా అంటువ్యాధుల నిరోధక సంస్థ చీఫ్ జెంగ్ గువాంగ్ తాజాగా స్పందించారు. సంక్షోభం తొలినాళ్లలో అమెరికా కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిపే బయోసేఫ్టీ ల్యాబ్స్ అమెరికాలోనే అధికంగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన ఆయన కరోనా మూలాలపై అగ్రరాజ్యంలోనూ దర్యాప్తు జరగాలని కోరారు. కరోనా పుట్టుకకు మూలాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని తాజా అధ్యయనం రుజువు చేసినట్టు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకరించాలని కూడా ఆయన కోరారు. కరోనా పుట్టుకకు చైనాలో జరిగిన రహస్య పరిశోధనలే కారణమని అనేక దేశాలు అనుమానిస్తున్న సమయంలో ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-06-17T22:36:57+05:30 IST