హిందీ సాకుతో రుణమివ్వని బ్యాంక్ మేనేజర్‌పై వేటు

ABN , First Publish Date - 2020-09-23T16:25:54+05:30 IST

హిందీ తెలిస్తేనే రుణమిస్తామన్న బ్యాంక్‌ మేనేజర్‌పై బదిలీ వేటు పడింది. ఆ బ్యాంక్‌ మేనేజన్‌ తీరుపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అరియలూరు జిల్లా

హిందీ సాకుతో రుణమివ్వని బ్యాంక్ మేనేజర్‌పై వేటు

చెన్నై (ఆంధ్రజ్యోతి): హిందీ తెలిస్తేనే రుణమిస్తామన్న బ్యాంక్‌ మేనేజర్‌పై బదిలీ వేటు పడింది. ఆ బ్యాంక్‌ మేనేజన్‌ తీరుపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అరియలూరు జిల్లా యుద్ధపల్లం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ డాక్టర్‌ స్రుబ మణియన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిచేందుకు చోళపురం లోని ఓ జాతీయ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై బ్యాంక్‌ మేనేజర్‌ విశాల్‌ నారయణన్‌ కాంబ్లేను సంప్రతించినప్పుడు మీకు హిందీ భాష వచ్చునా?’ అని ప్రశ్నించారు. తనకు తమిళం, ఆంగ్లం మాత్రమే తెలుసని హిందీ చదువులేదని సుబ్ర మణియన్‌ తెలిపారు. దీంతో హిందీ తెలిస్తేనే రుణమిస్తా నని బ్యాంక్‌ మేనేజర్‌ ఖరాకండిగా తెలిపారు. దీంతో  సుబ్రమణియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తీరును మీడియా ప్రతి నిధులకు వివరించారు. ఈ విషయమై తన న్యాయవాది ద్వారా పంపిన నోటీసులకు మేనేజర్‌ బదులివ్వ లేదని తెలిపారు. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో వెలువడగానే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రుణమివ్వడానికి హిందీ భాష తెలిస్తేనే రుణమిస్తానని చెప్పిన బ్యాంక్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనితో ఆ బ్యాంక్‌ నిర్వాహకులు బ్యాంక్‌ మేనేజర్‌ను తిరుచ్చి రీజినల్‌ ఆఫీసుకు  బదిలీ చేశారు.

Updated Date - 2020-09-23T16:25:54+05:30 IST