Abn logo
Apr 18 2021 @ 00:00AM

హిందీ అపరిచితుడు హీరోయిన్‌ కియారా?

సామాజిక కథాంశాలతో తనదైన శైలిలో సూపర్‌ హిట్‌ సినిమాలను తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు శంకర్‌ ముందుంటారు. విక్రమ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రణ్‌వీర్‌సింగ్‌తో రీమేక్‌ చేయనున్నట్టు ప్రకటించటం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పనులను శంకర్‌ మమ్మురం చేశారట.


ఇందులో రణ్‌వీర్‌ సరసన హీరోయిన్‌గా కియారా అడ్వాణీని తీసుకోవటానికి శంకర్‌ ఆసక్తి చూపుతున్నారని బాలీవుడ్‌ టాక్‌. శంకర్‌లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం రావటంతో ఆ ప్రతిపాదనకు కియారా కూడా ఓకే చె ప్పారని టాక్‌. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం కియారా ‘షేర్షా’ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన, కార్తీక్‌ ఆర్యన్‌తో ‘భూల్‌ భూలయ్యా 2’, వరుణ్‌ ధావన్‌తో ‘జుగ్‌ జుగ్గ్‌ జియో’ చిత్రాల్లో నటిస్తున్నారు.