ఆలయాలకు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-06-01T07:49:18+05:30 IST

అమెరికాలో కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం వివిధ రంగాల పై తీవ్రంగా పడింది. వీటిలో ముఖ్యమైనది ఆలయాల నిర్వహణ. కరోనా వల్ల ఆలయాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, జరుగుతున్న పూజలు...

ఆలయాలకు కరోనా దెబ్బ

  • అమెరికాలో మూతపడిన గుళ్లు
  • ఆదాయం లేక నిర్వహణలో ఇబ్బందులు
  • కొనసాగుతున్న ధూప, దీప, నైవేద్యాలు 
  • ఊపందుకున్న ఆన్‌లైన్‌ పూజలు 
  • రప్రవాస వేదపండితుడు రఘుశర్మ  
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వెల్లడి


(న్యూయార్క్‌ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ) 

అమెరికాలో కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం వివిధ రంగాల పై తీవ్రంగా పడింది. వీటిలో ముఖ్యమైనది ఆలయాల నిర్వహణ. కరోనా వల్ల ఆలయాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, జరుగుతున్న పూజలు, అక్కడి ఆలయాల ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రముఖ ప్రవాస వేదపండితుడు, న్యూజర్సీలోని ‘సాయి దత్తపీఠం’ ప్రధాన నిర్వాహకులు శంకరమంచి రఘుశర్మ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పేరేచర్ల. విజయవాడ బెంజ్‌ సెంటర్‌, హైదరాబాద్‌ దిల్‌సుక్‌నగర్‌లో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రధాన అర్చకులుగా పనిచేసి 2002లో న్యూజర్సీకి చేరారు. 2014 వరకు అక్కడి షిర్డీ ఆలయంలో పనిచేశారు. అనంతరం ఎడిసన్‌లో ‘సాయి దత్త పీఠం’ పేరుతో సాయిబాబా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లక్ష డాలర్ల ఖర్చుతో ‘అమెరికాలో షిర్డీ’ పేరిట పెద్ద ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. దీని కోసం న్యూజర్సీలోని సోమర్‌సెట్‌లో 25 ఎకరాలు కొనుగోలు చేశారు. నూతన ఆలయం కోసం ఆయన అమెరికాలోని 43 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి నిధులు సేకరించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆలయాల నిర్వహణలో ఏర్పడిన ఇబ్బందుల గురించి ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘుశర్మ వివరించారు. 


ధూప, దీప, నైవేద్యాలకే పరిమితం 

కరోనా వల్ల మార్చి 15 నుంచి హిందూ దేవాలయాల్లో భక్తుల రాకను నిషేధించారు. అయినప్పటికీ ప్రతి రోజు అన్ని సేవలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ నిత్య పూజలు జరుపుతున్నాం. భక్తులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఆలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. 


ఊపందుకున్న ఆన్‌లైన్‌ పూజలు

లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌ పూజలు ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌లో కూడా మాకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. నిత్యపూజలు, ఇతర కార్యక్రమాలన్నీ యథావిధిగా సాగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే పూజారులు వ్యక్తిగత పూజలను అనుమతిస్తున్నారు. బారసాల, నామకరణ మహోత్సవం, పుట్టినరోజు, షష్టిపూర్తి, సంవత్సరీకాలు వంటి కార్యక్రమాలను భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ లోనే నిర్వహిస్తున్నాం. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భక్తులకు, పండితులకు తెలుసు.


ఆలయాల ద్వారా సేవా కార్యక్రమాలు

కరోనా సమయంలోనూ అమెరికాలోని చాలా ఆలయాల ద్వారా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేద విద్యార్థులకు ఆహారం అందిస్తున్నాం. కరోనా విధుల్లో ఉన్న వైద్యసిబ్బందికీ, పోలీసులకు అమెరికా ఆహారాన్ని అందిస్తున్నాం. న్యూజర్సీలోని మా ఆలయంలో లాక్‌ డౌన్‌కు ముందు ఏడాదంతా అన్నదానం చేసేవాళ్లం. ప్రస్తుతం మా వంటశాలలో ఆహారాన్ని తయారు చేసి అవసరమైన వారికి అందిస్తున్నాం. 


ప్రభుత్వ సహకారం మరువలేనిది

అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. తెలుగు పూజారులు ఇక్కడ వెయ్యి మందికి పైగా ఉంటారని ఆంచనా. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన అర్చకులకు ట్రంప్‌ సర్కార్‌ తొలివిడతగా 1200 డాలర్ల చొప్పున సాయం అందించింది. ఆలయాల సామర్ధ్యాన్ని బట్టి లక్ష డాలర్ల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. మా ఆలయానికి 45000 డాలర్ల రుణం అందించారు.  


తెలుగు వివాహాలు భవిష్యత్తులో పెరుగుతాయి

లాక్‌డౌన్‌కు ముందే హిందూ వివాహాలు పెరిగాయి. లాక్‌డౌన్‌లో జరిగేవి చాలా తక్కువ. జూన్‌ 15 నుంచి ఆలయాలు తెరుచుకోవ చ్చు. జూలై చివరి నుంచి వివాహ ముహూర్తా లు ఉన్నాయి. ఆ సమయంలో వివాహాల సంఖ్య గతంకన్నా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ము హూర్తాలు ఖరారైనా.. కరోనా వల్ల ఇక్కడి యు వతీ, యువకులు స్వదేశం వెళ్లి పెళ్లి చేసుకోలేని పరిస్థితులున్నాయి. చాలా మందికి ఉద్యోగాలు పో యాయి. కొందరికి వీసాల సమస్య ఉంది. రాకపోకలుస్తంభించాయి. ఏడాది వరకూ పరిస్థితులు ఇలా గే ఉండొచ్చు.  పెళ్లి ఖర్చుల విషయానికి వస్తే.. వివా హం చేసుకునే వారి తాహతును బట్టి మారుతుంటుంది. గతంలో సన్నాయి వాద్యకారులను కెనడా నుంచి రప్పించేవారు. ప్రస్తుతం ఇక్కడ పెళ్లికి సంబంఽధించిఅన్నీ అందుబాటులో ఉన్నాయి. వారి వారి స్తోమతను బట్టి వివాహం జరిపించే పూజారులకు 500-2000 డాలర్ల వరకు దక్షిణగా ఇస్తారు. 

Updated Date - 2020-06-01T07:49:18+05:30 IST