రాజమండ్రిలో హిందూ జనచైతన్య వేదిక ఆందోళన

ABN , First Publish Date - 2021-09-08T18:21:17+05:30 IST

వినాయకచవితిపై ప్రభుత్వం ఆంక్షలు నిరసిస్తూ రాజమండ్రిలో హిందూ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

రాజమండ్రిలో హిందూ జనచైతన్య వేదిక ఆందోళన

రాజమండ్రి: వినాయకచవితిపై ప్రభుత్వం ఆంక్షలు నిరసిస్తూ రాజమండ్రిలో హిందూ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ జనచైతన్య వేదిక ప్రతినిధులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులను టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందువుల పండుగలకు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అన్యమతాలకు లేకుండా కేవలం హిందువుల పండుగలకే నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, కానీ ఒక్క హిందువుల పండుగలను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని వారు మండిపడ్డారు. 

Updated Date - 2021-09-08T18:21:17+05:30 IST