మక్కాకు వెళ్లొచ్చిన అన్నకు నెగిటివ్.. కానీ తమ్ముళ్లకు కరోనా పాజిటివ్..!

ABN , First Publish Date - 2020-04-09T22:08:29+05:30 IST

బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో హిందూ పురం ప్రజల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. ఇప్పటికే జిల్లా లో తొలి కరోనా మరణంతో పాటు మరో ఐదు పాజిటివ్‌ కేసుల

మక్కాకు వెళ్లొచ్చిన అన్నకు నెగిటివ్.. కానీ తమ్ముళ్లకు కరోనా పాజిటివ్..!

కరోనా రెడ్‌జోన్‌గా హిందూపురం !

తాజాగా ముక్కిడిపేటలో మరో ఇద్దరికి పాజిటివ్‌

పురం పరిసరాల్లో 8కి చేరిన పాజిటివ్‌ కేసులు

మరో 70 మందికి శాంపిల్స్‌ సేకరణ


హిందూపురం(అనంతపురం): బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో హిందూ పురం ప్రజల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది.  ఇప్పటికే జిల్లా లో తొలి కరోనా మరణంతో పాటు మరో ఐదు పాజిటివ్‌ కేసుల నమోదుతో కంటైన్మెంట్‌ జోన్‌గా ఉన్న పురంలో బుధవారం మరో రెండు కరోనా కేసులు వెలుగు చూశా యి. పాజిటివ్‌ కేసులన్నీ మక్కాయాత్రకు వెళ్లి వచ్చిన బృందంతో కాంటాక్ట్‌గా నమోదు అవుతున్న తరుణంలో పురంలో మూడవ దశలోకి వైరస్‌ విస్తరిస్తోందన్న ఆందోళన అటు అధికార యంత్రాంగంతో పాటు ప్రజల్లో  కలుగు తోంది. హిందూపురంలోని  ఫిజియో థెరపీ క్లినిక్‌ నిర్వాహ కుడికి పాజిటివ్‌ రావడంతో ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారితోపాటు మరో 70 శాంపిల్స్‌ బుధవారం సేకరించా రు. కొత్త కేసుల నమోదుతో హిందూపురం పూర్తిగా రెడ్‌జోన్‌కి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 


ఫిజియోథెరపీ కాంటాక్ట్‌ శాంపిల్స్‌పై టెన్షన్‌

హిందూపురంలోని ఫిజియోథెరపీ క్లినిక్‌ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతన్ని కలిసిన వారి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇతడి తండ్రి కరోనా కాటుకు మృతి చెందగా వీరి ఇంట్లోనే 80 ఏళ్ల వృద్ధురాలికి కూడా సోకడంతో అనంతపురం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతు న్న సంగతి తెలిసిందే. గత నెల 12 నుంచి 31వరకు క్లినిక్‌లో కలిసిన సల హాలు తీసుకున్న హిందూపురం పట్ట ణంలోని పలు కాలనీ లకు చెందిన వారితోపాటు పరిగి, గోరంట్ల, చిలమత్తూరు, లేపాక్షి, సోమందేపల్లి, పెనుకొండ, కర్ణాటకలోని గౌరీబిదనూరు, సరిహద్దు ప్రాంతాల్లోని 59 మందిని గుర్తించి రక్తశాంపిల్స్‌ను తీసుకున్నారు. ఇంట్లో పనిమనిషితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల తోపాటు ఏఏ ఇళ్లలో ఆమె పనిచేసిందో ఆరాతీసి ఆమె  కలిసిన వారందరికి వైద్యఆరోగ్య శాఖ రక్త నమూనాలు సేకరించింది. 


అన్నకు నెగిటివ్‌.. ఇద్దరు తమ్ముళ్లకు పాజిటివ్‌

మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన బృందంలో 27 మందిలో టిప్పు ఖాన్‌ స్ర్టీట్‌కు చెందిన మహిళలకు మినహా మిగిలిన వారం దరికి కరోనా రక్త పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ వచ్చింది. మక్కాయాత్రకు వెళ్లి వచ్చిన వారి నుం చే కేసులు నమోదు పెరిగిన నేపథ్యంలో మరోసారి అందరికి రక్తనమూ నాలను సేకరించారు. పరీక్షల నిమిత్తం పంపారు. మక్కాకు వెళ్లి వచ్చిన బృందంలో పట్టణంలోని ముక్కిడిపేటకు చెందిన ఓవ్యక్తికి తొలి పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది.  కుటుంబ సభ్యుల తో కాంటాక్ట్‌ అనుమానంతో రక్త పరీక్షలు చేయించగా ఇద్దరికి బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరు మక్కా యాత్రకు వెళ్లకున్నా యాత్రకు వెళ్లి వచ్చిన అన్నను కాంటాక్ట్‌ అయినట్లు గుర్తించారు. అన్నకు తొలి రక్త శ్యాంపిల్స్‌లో నెగిటివ్‌ వచ్చినా తమ్ముళ్లకు పాజిటివ్‌ రావడంపై తీవ్ర ఆందోళన కలుగు తోంది. ఎలా వచ్చిందో వైద్యఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. వీరు ఎవరిని కలి శారో వారి గుర్తింపు కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇదే కాలనీల్లో ఉండే ప్రైవేట్‌ అంబు లైన్‌ డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చింది. ముక్కిడిపేట, హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదుతో ఆ కాలనీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


మక్కా యాత్ర చుట్టూనే కరోనా.. వేగంగా వైరస్‌ మూడవ దశలోకి

పురంలో నమోదవుతున్న కరోనా కేసులన్నీ మక్కాయా త్రకు వెళ్లివచ్చిన బృందం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈబృందంలో తొలికేసులు కర్ణాటక గౌరీబిదనూరులో వెలు గుచూడగా పురంలో ఓమహిళ తోపాటు లేపాక్షిలో పదేళ్ల బాలుడికి కాంటాక్ట్‌గా నమోదు అయ్యింది. హౌసింగ్‌ బో ర్డులో మక్కా యాత్ర కాంటాక్ట్‌తో 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా ఆ కుటుంబ సభ్యుల్లోని వృద్ధురాలితోపాటు ఫిజి యోథెరపీ క్లినిక్‌ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  మక్కాయాత్రకు వెళ్లక పోయినా ఇద్దరికి కాంటాక్ట్‌ అను మానంతో రక్తనమూ నాలు పరీక్షించగా పాజిటివ్‌ రావ డంతో మక్కాయాత్రనుంచే కరోనా వైరస్‌ వచ్చినట్లుగా వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పట్టణంలోని పలుకాలనీల్లో ముందు జాగ్రత్తగా ర్యాండమ్‌ శాంపిల్స్‌ను సేకరిస్తోంది. ఇప్పటికే సేకరించిన శ్యాంపిల్స్‌ ఫలితాలు వస్తేగాని పట్టణంలో వైరన్‌ విస్తరణ పరిస్థితి తెలుస్తుంది.


నిత్యావసర వస్తువుల టెన్షన్‌

కరోనా నియంత్రణ చర్యలను అధికార యంత్రాంగం మూడు రోజులుగా కఠిన తరంచేసింది. పట్టణంలో కా యగూరలతో పాటు నిత్యావసర వస్తువుల మార్కెట్లను పూర్తిగా బంద్‌ చేసి పట్టణాన్ని దిగ్బంధం చేశారు. ప్ర ధానంగా కూరగాయల మార్కెట్లు, నిత్యావసర సరుకులు ఇంటికే చేరుస్తామని చెబుతున్నా పట్టణంలో కూరగా యల, నిత్యావసర సరుకుల కోసం జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది. బుధవారం నుంచి ఇంటింటికి సరఫరా చేస్తా మని బయటకు వస్తే కేసులే అంటూ అధికారుల హె చ్చరికలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్డెక్కితే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. ఈనేపథ్యంలో పట్టణంలోకి నిత్యవసర వస్తువుల సరఫరా కాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

Updated Date - 2020-04-09T22:08:29+05:30 IST