Viral Video: ట్రైన్‌లో సీటు కోసం ఇతడు ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2022-02-19T02:52:44+05:30 IST

బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో చాలా మందికి ప్రధానంగా సీటు విషయంలోనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. సీటు దొరికినవారు ప్రపంచాన్ని జయించినంత ఆనందంలో ఉంటారు. దొరకని వారు నిరుత్సాహంతో..

Viral Video: ట్రైన్‌లో సీటు కోసం ఇతడు ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో చాలా మందికి ప్రధానంగా సీటు విషయంలోనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. సీటు దొరికినవారు ప్రపంచాన్ని జయించినంత ఆనందంలో ఉంటారు. దొరకని వారు నిరుత్సాహంతో.. ఎప్పుడు ఎవరి సీటు ఖాళీ అవుతుందా.. అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో గంటలు గంటలు నిలబడే ప్రయాణించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. రద్దీగా ఉన్న సమయంలో సీటు కోసం కొందరు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. రైల్లో సీటు కోసం వినూత్నమైన ప్లాన్ వేశాడు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశిస్తాడు. అయితే అతడికి సీటు దొరకదు. దీంతో ఎలాగైనా సీటు సంపాదించాలని నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడికి వినూత్నమైన ఆలోచన వస్తుంది. వెంటనే వాంతులు వస్తున్నట్లుగా నటిస్తాడు. ఎక్కడ తమ మీద వాంతి చేసుకుంటాడో అనే భయంతో కూర్చుని ఉన్న వారంతా పరుగందుకుంటారు. అంతా వెళ్లాక.. తీరిగ్గా సీట్లో కూర్చుంటాడు. ‘‘ఎలా ఉంది.. ఐడియా’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి, సెల్ చూసుకుంటూ ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అంటూ లైవ్‌లోనే యాంకర్‌ను అడిగేసిన వ్యక్తి.. అవాక్కయిన ఆమె చివరకు ఏం చేసిందంటే..





Updated Date - 2022-02-19T02:52:44+05:30 IST