Advertisement

తెలుగు జాతికి ఆయన మరణం తీరని లోటు: సి అశ్వనీదత్

ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ సీతారామశాస్త్రి గారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. తెలుగు జాతికి ఆయన మరణం తీరని లోటు..ఆయన మహాకవి. తుదిశ్వాస విడిచిన రోజు తెలుగు భాష కుప్పకూలింది. నా జీవితంలో మొదటి సినిమా నుంచి ఆత్రేయ గారు, సుందర రామ్మూర్తి గారు..ఆ తరువాత అన్ని పాటలూ నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో రాయించినవే. ఆయన ఆఖరి రోజుల్లో మాతోనే ఉన్నారు. మా సినిమా పాటలు రాశారని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’సినిమాకి 5 పాటలు ఆయనే రాయాలి. ఇప్పుడు ఆయన లేరు..అని అన్నారు.  

Advertisement