Abn logo
Apr 6 2021 @ 18:33PM

వారిద్దరి కంటే... ఈయన లాభాలే ఎక్కువ...

అహ్మదాబాద్ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో ఘనత సాధించారు.  ప్రపంచంలోని టాప్-20 కుబేరుల జాబితాలో ఆయన స్థానం సంపాదించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. అతి తక్కువ కాలంలోనే అదానీ తన సంపదను గణనీయంగా పెంచుకున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుతో మైనింగ్, పోర్టులు, పవర్ ప్లాంట్లు, డేటా సెంటర్లు, డిఫెన్స్ రంగాల్లో గౌతమ్ అదానీ రాణిస్తున్నారు.


ఫోర్బ్స్ ప్రకారం... మార్చి నాటికి గౌతమ్ అదానీ నికర సంపద 61.5 బిలియన్ డాలర్లు. కిందటి సంవత్సరం అదానీ సంపద  16.2 బిలియన్ డాలర్లు. అదే సంవత్సరం అతి ఎక్కువ లాభాలు ఆర్జించిన వ్యక్తుల్లో అదానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించిన వ్యక్తిగా అదానీ రికార్డు సృష్టించారు. కాగా ఏపీలో వరుసగా పలు పోర్టులను అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement