Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ సాధనలో కేసీఆర్‌దీక్షకు చారిత్రక గుర్తింపు

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 29 : ప్రాణాలకు తెగించి కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటం చరిత్రపుటల్లో నిలిచిపోతుందని మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం మంత్రి నవంబరు 29 దీక్షా దివస్‌ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, ఉద్యమ పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమగతిని దీక్షాదివస్‌ మార్చిందని తెలిపారు. కేసీఆర్‌ చేసిన 11 రోజుల అకుంఠితదీక్ష, ప్రాణత్యాగం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిందన్నా రు. కేసీఆర్‌ త్యాగాలను తెలంగాణ ప్రజలు మరువరాదని పేర్కొన్నారు. కేసీ ఆర్‌ దీక్షాదివస్‌ ప్రతీఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. 

కేసిఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది : ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఖానాపూర్‌, నవంబరు 29 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఉద్యమంతోనే తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షాదివస్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం  అ భివృద్ది సాధ్యమని తెలంగాణ సమాజం నమ్మడంతోనే ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసిన ప్రజలు వారిని విశ్వసించడం లేదన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, మాజీ జడ్‌పీటీసీ, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాథోడ్‌ రామునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ శనిగారపు శ్రావణ్‌కుమార్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షులు పార్శపు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణాక్ష్యక్షులు పరిమి సురేష్‌, జిల్లా నాయకులు ఎనగందుల నారాయణ, ద్యావతి రాజేశ్వర్‌, సంతోష్‌, కౌఠ మహేష్‌, ఎల్ముల శోభన్‌బాబు, మనోజ్‌, గౌరికర్‌ రాజు తదితరులున్నారు. 

Advertisement
Advertisement