చరిత్ర గొప్పతనాన్ని తెలిపే తపాల స్టాంపులు

ABN , First Publish Date - 2021-03-06T06:21:43+05:30 IST

చరిత్ర గొప్పత నాన్ని తెలిపేవే తపాల స్టాంపులు అని చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు.

చరిత్ర గొప్పతనాన్ని తెలిపే తపాల స్టాంపులు

  • చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ వెంకటేశ్వర్లు.. ముగిసిన ప్రదర్శన

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 5: చరిత్ర గొప్పతనాన్ని తెలిపేవే తపాల స్టాంపులు అని చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. రాజమ హేంద్రవరం పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో పోస్టల్‌ సూప రింటెండెంట్‌ చిక్కాల సూర్య నారాయణ అధ్యక్షతన స్థానిక త్యాగరాజ నారాయణ దాస కన్వెన్షన హాలులో జరుగుతున్న తపాల స్టాంపుల ప్రదర్శన శుక్రవారం ముగిసింది. రెండో రోజు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగి న సభకు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్టాంపుల విశిష్టతను తెలియ జేశారు. స్టాంపుల సేకరణ, అభిరుచి విద్యార్థుల్లో పెంపొందించడానికి ఇటువం టి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. విశిష్ట అతిథిగా స్థానిక సబ్‌కలె క్టర్‌ అనుపమాంజలి విచ్చేసి ప్రదర్శనను తిలకించి వాటిని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. అనేక చారిత్రక అంశాలు స్టాంపుల్లో దాగి ఉంటాయ న్నారు. అనంతరం వ్యాసరచన, క్విజ్‌ పోటీల విజేతలకు వెంకటేశ్వర్లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:21:43+05:30 IST