ఎప్పుడైనా ఆలోచించారా?.. వారానికి ఏడు రోజులే ఎందుకు ఉంటాయి? ఎనిమిదో, పదో ఎందుకుండవు?.. అసలు సంగతి తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-04T14:43:35+05:30 IST

వారానికి ఏడు రోజులు.. నెలకు నాలుగు వారాలే..

ఎప్పుడైనా ఆలోచించారా?.. వారానికి ఏడు రోజులే ఎందుకు ఉంటాయి? ఎనిమిదో, పదో ఎందుకుండవు?.. అసలు సంగతి తెలిస్తే..

వారానికి ఏడు రోజులు.. నెలకు నాలుగు వారాలే ఎందుకు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పటి నుంచో ఇలానే ఎందుకు కొనసాగుతోంది? ఈ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. వారానికి ఏడు రోజులు ఉండటం వెనుక ఆస్తకికర కథనం ఉంది. చాలా ఏళ్ల క్రితం నాగరికత తొలినాళ్లలో.. వారంలో ఉండాల్సిన రోజులపై పరిశోధనలు జరిగాయి. విశ్వం మనుగడను గమనించి.. గ్రహాలు, సూర్యుడు, చంద్రుల కదలికలపై అనేక సందేహాలు ఉండేవి. అయితే బాబిలోనియన్లు (నేటి ఇరాక్) ఖగోళ గణనలో చాలా నిపుణులు. వారంలో 7 రోజులు అనే విషయాన్ని వారే అందరిముందు ఉంచారు. వారు.. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుగ్రహాల కదలికలను గమనించారు. చంద్రుని 28 రోజుల కక్ష్య ఆధారంగా.. వారానికి 7 రోజులు, నెలకు నాలుగు వారాలు అనేదానిని రూపొందించారు. 


ఆ సమయంలో ఈజిప్టు, రోమన్ తదితర ఇతర నాగరికతలలో వారానికి ఎనిమిది లేదా పది రోజులు ఉండేవి. ఇక భారతదేశం విషయానికొస్తే.. అలెగ్జాండర్ భారతదేశం చేరుకున్న తరువాత గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో వారానికి ఏడు రోజుల విధానం ఉండేది. బహుశా భారతదేశం ఈ విధానాన్ని స్వీకరించిన తర్వాతనే.. చైనా ఏడు రోజుల వారాన్ని ప్రవేశపెట్టిందని చెబుతారు. ఇస్లాం, జుడాయిజం ప్రజలు ఏడు రోజుల వారంలో ఒక రోజు ప్రార్థనల కోసం కేటాయించేవారు. మిగిలిన రోజులలో పని చేసేవారు. అప్పటి నుంచి ప్రజలందరూ వారంలో 6 రోజులు పని చేసేందుకు, మతపరమైన పనుల కోసం ఒక రోజు కేటాయించేవారు. ఈ నేపధ్యంలోనే వారాలకు గ్రహాల పేర్లు పెట్టారు. ఈ కాగా ఈ కాల గణనకు ముందు.. సంవత్సరానికి 10 నెలలు మాత్రమే ఉండేవి. నూతన సంవత్సరం అనేది మార్చి నుంచి ప్రారంభమయ్యేది. అప్పట్లో ఏడాది చివరి నెల డిసెంబర్‌గానే ఉండేది. అనంతరం మార్చి నెల వచ్చేది. ఆ తరువాత సంవత్సరానికి జనవరి, ఫిబ్రవరి నెలలు జోడించారు. జనవరి నెల 153 బీసీ సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికిముందు మార్చి ఒకటి.. సంవత్సరంలో మొదటి రోజుగా ఉండేది.

Updated Date - 2022-01-04T14:43:35+05:30 IST