HMDA : కీచకుడిని కాపాడే యత్నం..?

ABN , First Publish Date - 2022-01-15T12:05:38+05:30 IST

హెచ్‌ఎండీఏలో మహిళా స్వీపర్‌తో అనుచితంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘం నేతను

HMDA : కీచకుడిని కాపాడే యత్నం..?

  • హెచ్‌ఎండీఏ స్వీపర్‌కు లైంగిక వేధింపులు


హైదరాబాద్‌ సిటీ : హెచ్‌ఎండీఏలో మహిళా స్వీపర్‌తో అనుచితంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘం నేతను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని సంస్థలోని కొందరు మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3న విధి నిర్వహణలో ఉన్న మహిళను ఏఈఓ స్థాయి అధికారి ఒకరు లైంగికంగా వేధించాడనే ప్రచారం జరిగింది. సదరు మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే కొందరు అధికారులు ఉద్యోగ సంఘం నేతను కాపాడేందుకు వాస్తవాలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 


దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన మహిళా అధికారి సమగ్ర విచారణ జరపడం లేదని, ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తోన్న ఓ అధికారి కూడా ఉద్యోగ సంఘం నేతను కాపాడాలని చూస్తున్నాడన్న విమర్శలున్నాయి. సంస్థలోని సీసీ కెమెరా పుటేజీల్లో ఘటనకు సంబంధించిన దృశ్యాలున్నాయని, వాటిని పరిశీలించి ఉద్యోగ సంఘం నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగ సంఘం నేత ఓ పార్టీలో కూడా కీలకంగా ఉంటారని చెబుతున్నారు. సంస్థలోని ఇతర మహిళా ఉద్యోగులను సదరు అధికారి ఇలానే వేధిస్తున్నాడని చెబుతున్నారు. 

Updated Date - 2022-01-15T12:05:38+05:30 IST