Abn logo
Feb 24 2021 @ 23:40PM

రైతు ఉద్యమ అణచివేతను ఖండించాలి

 కాళోజీ జంక్షన్‌, ఫిబ్రవరి 24: మోదీ ప్రభుత్వ రైతు ఉద్యమ అణచివేతను ఖం డించాల్సిందిగా అఖిలభారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ జిల్లా కో కన్వీనర్‌ రాచర్ల బాలరాజు అన్నారు. బుధవారం హన్మకొండలోని కాళోజీ విగ్రహం ముందు వివిధ ప్రజాసంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలరాజుతోపాటు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నున్నా అప్పారావు, ఆర్‌ఎ్‌సపీ జిల్లా కార్యదర్శి శివాజీ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ వలీ ఉల్లాఖాద్రీ, పీడీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ఖన్నా, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రమా, రైతుసంఘాల జిల్లా నాయకులు సుదమళ్ల భాస్కర్‌, చిర్ర సూరి తదితరులు నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. బండి కోటేశ్వర్‌రావు, బాబన్న, మండల యుగంధర్‌, సుమన్‌, పసునూరి రాజు, రాజేందర్‌, కొమురయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement