పీఎం-కేర్స్ ఫండ్‌కు హాకీ ఇండియా విరాళం

ABN , First Publish Date - 2020-04-05T00:28:31+05:30 IST

కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహాయం అందించేందుకు హాకీ ఇండియా ముందుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన రూ.25 లక్షలను

పీఎం-కేర్స్ ఫండ్‌కు హాకీ ఇండియా విరాళం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహాయం అందించేందుకు హాకీ ఇండియా ముందుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన రూ.25 లక్షలను విరాళంగా ప్రకటించిన హాకీ ఇండియా.. మరో రూ.75 లక్షలను దానికి జత చేసి రూ.కోటిని పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.


ఈ విషయాన్ని హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు వెల్లడించింది. ‘‘ఈ కష్ట సమయంలో కోవిడ్-19 మహమ్మారిని అడ్డుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి అందరూ ఒక అడుగు ముందుకు వేసి అండగా నిలబడాలి. ఎన్నో ఏళ్లుగా ఈ దేశ ప్రజలు మాకు మద్దతుగా నిలిచారు. ఈసారి వారి రుణం తీర్చుకొనే అవకాశం మాకు లభించింది’’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.


హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ రజీందర్ సింగ్‌ కూడా ముస్తాక్ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు హాకీ ఇండియా ఎప్పుడూ ముందుంటుంది. పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.కోటి విరాళంగా ఇవ్వాలని మా ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకున్న నిర్ణయం చూసి నాకు చాలా గర్వంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

Updated Date - 2020-04-05T00:28:31+05:30 IST