ఆనందోత్సాహాల హోలీ

ABN , First Publish Date - 2022-03-19T07:06:17+05:30 IST

హోలీ సంబరాలు జిల్లాలో అంబరాన్నంటాయి. శుక్రవారం చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే వేడుకల్లో పాల్గొన్నారు.

ఆనందోత్సాహాల హోలీ
హోలీ సంబరాల్లో ఎస్పీ రాహుల్‌హెగ్డే, పోలీస్‌ అధికారులు

సిరిసిల్ల మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : హోలీ సంబరాలు జిల్లాలో అంబరాన్నంటాయి. శుక్రవారం చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, చక్రపాణి దంపతులతో పాటు కౌన్సిలర్లు  హోలీ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రెస్‌క్లబ్‌, విద్యానగర్‌లో  అభయాంజనేయ వెల్ఫేర్‌  సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హోలీ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద డీజే సౌండ్‌లను ఏర్పాటు చేసుకోని నృత్యం చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొన్నారు.  జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు ప్రజలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. 

Updated Date - 2022-03-19T07:06:17+05:30 IST