60 వేల తేనెటీగలు... 18 నిమిషాలు..!

ABN , First Publish Date - 2021-06-02T05:30:00+05:30 IST

ఇది సినిమా కాదు. డూపులు లేవు. గ్రాఫిక్స్‌ లేవు. కనిపిస్తున్నది హాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఏంజిలినా జోలీనే! ఆమెను కప్పేసింది తేనెటీగలే! ఒకటి రెండు కాదు...

60 వేల తేనెటీగలు... 18 నిమిషాలు..!

ఇది సినిమా కాదు. డూపులు లేవు. గ్రాఫిక్స్‌ లేవు. కనిపిస్తున్నది హాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఏంజిలినా జోలీనే! ఆమెను కప్పేసింది తేనెటీగలే! ఒకటి రెండు కాదు... అక్షరాల అరవై వేల తేనెటీగలు పద్దెనిమిది నిమిషాలపాటు ఏంజిలినా మేనిపై సేద తీరాయి. ఎలాంటి రక్షణ కవచమూ లేకుండా అన్నివేల తేనెటీగలను ఒంటిపైకి ఆహ్వానించి వహ్వా అనిపించింది ఆమె.


ఇది అందానికి మెరుగులద్దుకొనేందుకో, తన మార్కెట్‌ను పెంచుకోవడానికో కాదు... తేనెటీగల పరిశ్రమలో మహిళలను ప్రోత్సహించడానికి. ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌’ చానల్‌ చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం కోసం లెజెండ్రీ ఫొటోగ్రాఫర్‌ డాన్‌ వింటర్స్‌ చేసిన ఫొటో షూట్‌ ఇది. 

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST