May 5 2021 @ 08:54AM

‘బ్రీత్ ఇండియా’ అంటోన్న హాలీవుడ్

కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం మ‌న దేశంలో చాలా ఎక్కువ‌గా ఉంది. ప్ర‌జలు స‌కాలంలో వైద్య సాయం అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌దేశాలు భార‌త‌దేశానికి త‌మ వంతు సాయాన్ని అందించ‌డానికి ముందుకొస్తున్నాయి. ఈ క్ర‌మంలో హాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సైతం భార‌త‌దేశంలో కొవిడ్ బాధితులకు అండ‌గా నిల‌బ‌డటానికి ముందుకు వ‌చ్చారు. అందులో భాగంగా రైట‌ర్‌, పాడ్ కాస్ట‌ర్ జ‌య్‌శెట్టి త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి  ‘బ్రీత్ ఇండియా’ ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టారు. భార‌త‌దేశంలోని అన్న‌ద‌మ్ముల కోసం వీలైనంత సాయం చేయండని అమెరిక‌న్ న‌టి మిండీ క్యాలింగ్ సోష‌ల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు. 


హాలీవుడ్ యాక్ట‌ర్ స్మిత్ ఫ్యామిలీ, కెన‌డియ‌న్ సింగ‌ర్, రైట‌ర్ షాన్ మెండెస్‌, అమెరిక‌న్ బిజినెస్ మ్యాన్ రోహన్ ఓజా, రైట‌ర్ బ్రెండెన్ త‌లా యాబై వేల డాల‌ర్స్ చొప్పున విరాళాల‌ను ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త నిక్ జోన‌స్ ‘టు గెద‌ర్’ ఇండియా కోసం విరాళాల‌ను సేక‌రిస్తున్నారు.