దుర్గా మండపాల వద్ద హోమాలు, కుంకుమార్చనలు

ABN , First Publish Date - 2021-10-15T05:44:45+05:30 IST

మండల కేంద్రంలోని చాముండేశ్వరీ అమ్మవారిని గురువారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ దర్శించుకున్నారు.

దుర్గా మండపాల వద్ద హోమాలు, కుంకుమార్చనలు
పెద్దమ్మ ఆలయంలో యజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం

దోమకొండ, అక్టోబరు 14: మండల కేంద్రంలోని చాముండేశ్వరీ అమ్మవారిని గురువారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ దర్శించుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ శేఖర్‌, సభ్యులు రాజయ్య, సర్పంచ్‌ అంజలి, శ్రీనివాస్‌, శేఖర్‌, నర్స య్య, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌, బోరెడ్డి కిషన్‌రెడ్డి, తహసీల్ధార్‌ మోతీసింగ్‌, నాగరాజు, శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కుంకుమార్చన
లింగంపేట: మండలంలోని లింగంపేట, పొల్కంపేట, మెంగారంలలో గురువారం దుర్గాదేవీ మండపాల్లో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్ర మాలు చేశారు. మండలంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువారం సరస్వ తీ దేవిగా అలంకరించారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని ఆయా మండలాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాల వద్ద గురువారం కుంకుమ పూజలు నిర్వహించారు. తాడ్వాయి మండలంలోని నందివాడలో దుర్గామాత వద్ద కుంకుమపూజలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని పెద్దమ్మ ఆలయంలో పట్టణ ముది రాజ్‌ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. పట్టణం లోని ఆయా ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున అమ్మ వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆలయ డైరెక్టర్‌ ప్రసాద్‌, పూజారి శివ తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్‌లో హోమం
నస్రుల్లాబాద్‌: నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో ప్రతిష్ఠిం చిన దుర్గామాత వద్ద భక్తులు హోమ కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం హోమంలో పాల్గొన్నారు. హోమం వల్ల అంతా మంచే జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నా రు. ఉదయం, సాయంత్రం వేళలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు అమ్మవారి నిమజ్జన శోభయాత్ర
మద్నూర్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మం డల కేంద్రంలో కొలువు దీరిన దుర్గామాత ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున పూజలు పూర్తి చేసి దుర్గామాత విగ్రహాలను మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా ఊరేగించి నిమజ్జనం చేస్తారు. నవరాత్రుల్లో దేవి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మద్నూర్‌లో మూడు చోట్ల దేవి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. విజయ దశమి రోజు దుర్గామాత ప్రతిమను నిమజ్జనం చేయడంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

Updated Date - 2021-10-15T05:44:45+05:30 IST