శ్రీశైలంలో హోమాలు

ABN , First Publish Date - 2022-01-24T04:17:56+05:30 IST

శ్రీశైలంలో ఆదివారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. దేవస్థానం ఏడురోజులపాటు నిర్వహించనుంది.

శ్రీశైలంలో హోమాలు

 శ్రీశైలం, జనవరి 23: శ్రీశైలంలో ఆదివారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. దేవస్థానం ఏడురోజులపాటు  నిర్వహించనుంది. ఈ విశేష కార్యక్రమంలో మృత్యుంజయహోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శీతలాదేవి హోమాలు జరిపించనున్నారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి స్వామికి పూజలు చేశారు. అనంతరం యాగశాలలో వేంచేబు చేయించిన చండీశ్వరస్వామికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజాదికాలు నిర్వహించి హోమాలను జరిపించారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు ఈ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్‌. లవన్న పాల్గొన్నారు. 

-   శ్రీశైలంలో ఆదివారం పురస్కరించుకొని స్వామిఅమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేసి పల్లకీలో ఆశీనులనుజేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. 


Updated Date - 2022-01-24T04:17:56+05:30 IST