ఇల్లు మరింత అందంగా

ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST

ఇల్లంటే ఆనందాల కొలువే. కొత్త ఇంట్లోకి మారినపుడు పరిసరాలు సరికొత్తగా ఉండేట్లు చూసుకోవాలి. కొత్త ఇంట్లో ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌లో కాస్త శ్రద్ధ చూపిస్తే సరి.. ఆహ్లాదకరంగా ఉంటుంది....

ఇల్లు మరింత అందంగా

ఇల్లంటే ఆనందాల కొలువే. కొత్త ఇంట్లోకి మారినపుడు పరిసరాలు సరికొత్తగా ఉండేట్లు చూసుకోవాలి. కొత్త ఇంట్లో ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌లో కాస్త శ్రద్ధ చూపిస్తే సరి.. ఆహ్లాదకరంగా ఉంటుంది. 

కొత్త ఇల్లు కొన్న తర్వాత ఎగ్జయిట్‌మెంట్‌తో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది. ఇల్లు కొన్న తర్వాత ఎలా ఉండాలనుకున్నామో ఓ స్పష్టత ఏర్పరుచుకోవాలి. దగ్గరుండి కోరినట్లు ఇంటీరియర్‌ వర్క్‌ చేయించుకోవాలి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌నే తీసుకుంటే.. బెడ్‌తో పాటు ఇంట్లో ఉంటే క్లోసెట్స్‌ను రెడీమేడ్‌గా కొనొచ్చు. లేదా మీ అభిరుచికి అనుగుణంగా.. కాస్త సమయం పట్టినా నచ్చినట్లు డిజైన్‌ చేయించుకోవచ్చు. కొత్త ఇంట్లోకి కొత్త వస్తువులనే ఎంపిక చేసుకుంటే ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనపడుతుంది. డైనింగ్‌ టేబుల్‌, కార్పెట్లు, చెక్క బీరువాలు, కాఫీటేబుల్‌ లాంటివి కొత్తవే కొనటం మంచిది. ఇంట్లో స్పేస్‌తో పాటు అందంగా కనిపించేందుకు ఇంటీరియర్‌ డిజైనర్‌ను సంప్రదించడం ఉత్తమం. ముందు కంఫర్ట్‌, తర్వాత బ్యూటిఫుల్‌గా పరిసరాలు ఉంటేనే ఆహ్లాదకరంగా ఉంటుంది.

Updated Date - 2022-01-27T05:30:00+05:30 IST