‘యాపిల్‌’లో ‘హోమ్‌ బటన్‌’!

ABN , First Publish Date - 2021-03-20T06:00:13+05:30 IST

‘హోమ్‌ బటన్‌’కు స్వస్తి పలకలేదని, దానిని మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నామని ఇటీవలె ‘యాపిల్‌’ పేర్కొంది. రాబోయే ఐఫోన్లలో ఈ బటన్‌ను మళ్ళీ తీసుకువచ్చిన పక్షంలో ఇది డిస్‌ప్లేతో ఇంటిగ్రేట్‌ అవుతుంది

‘యాపిల్‌’లో ‘హోమ్‌ బటన్‌’!

‘హోమ్‌ బటన్‌’కు స్వస్తి పలకలేదని, దానిని మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నామని ఇటీవలె ‘యాపిల్‌’ పేర్కొంది.  రాబోయే ఐఫోన్లలో ఈ బటన్‌ను మళ్ళీ తీసుకువచ్చిన పక్షంలో ఇది డిస్‌ప్లేతో ఇంటిగ్రేట్‌ అవుతుంది. అయితే  ఈ హోమ్‌ బటన్‌ మళ్ళీ ఎప్పటి నుంచి యాపిల్‌ తెరపైకి తెస్తుందనే విషయంలో మాత్రం స్పష్టతలేదు. కొత్త ఫోన్లలో టచ్‌ ఐడి,  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో రేటుతో సంబంధం లేకుండా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌  అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కనిపించనుంది. అయితే యాపిల్‌ దానికి అదనంగా ఇంకొన్ని ఫీచర్లను కలపవచ్చని ఊహిస్తున్నారు.


పేటెంట్లీ యాపిల్‌ నివేదిక ప్రకారం సెన్సర్‌ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్‌ కోసం యాపిల్‌ దరఖాస్తు చేసుకుందని సమాచారం. ఆఫ్‌ యాంగ్యులర్‌ యాక్సిస్‌ లైట్‌ ఆధారంగా అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సింగ్‌ను మరింత మెరుగుపర్చే పనిలో యాపిల్‌ ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లకు సంబంధించి 2013 నుంచే ఐఫోన్‌ పని చేస్తోంది. అయితే అది ఎన్నడు బైటకు వస్తుందన్న విషయం రూఢి కావటం లేదు. అసలీ సదుపాయం అందుబాటులోకి వస్తే, ఫింగర్‌ప్రింట్‌ను కనుగొనడంలో కచ్చితత్వాన్ని సాధించవచ్చు. ఈ పద్ధతిలో మూడు విధాలైన లేయర్లకు తోడు పిక్స్‌లేటెడ్‌ ఇమేజ్‌ సెన్సర్‌ కలగలుస్తాయి. ఐఫోన్‌ 13లో అండర్‌-డిస్‌ప్లే టచ్‌ ఐడి ఉందంటూ ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి.

Updated Date - 2021-03-20T06:00:13+05:30 IST