వానల్లో ఇంటి సంరక్షణ

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

వర్షాలు ప్రారంభం కావడంతోనే ఇంట్లో రకరకాల సమస్యలు బయటపడతాయి. అందుకే వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలంటే...

వానల్లో ఇంటి సంరక్షణ

వర్షాలు ప్రారంభం కావడంతోనే ఇంట్లో రకరకాల సమస్యలు బయటపడతాయి. అందుకే వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలంటే...


  • గోడలకు, సీలింగ్‌కు ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయేమో పరిశీలించాలి. లీకేజ్‌ వల్ల గోడలు తడిగా మారి ఫంగస్‌ ఫామ్‌ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గోడలకు వాటర్‌ప్రూఫింగ్‌ కోట్‌ పెయింట్‌ వేయాలి. 
  • వర్షపు నీరు వెళ్లే పైపులను ఒకసారి చెక్‌ చేయాలి. ఇంటి డాబాపైన పడిన వర్షపు నీరు నిలువ  ఉండకుండా సాఫీగా వెళ్లిపోయేలా చూసుకోవాలి.
  • ఇంట్లో కార్పెట్‌ ఉంటే వర్షాలు ప్రారంభం అయ్యే సమయంలో చుట్టి పక్కన పెట్టేయాలి. లేదంటే తడి కాళ్లతో ఇంట్లోకి వచ్చేయడం వల్ల కార్పెట్‌ దెబ్బతింటుంది. ఒకవేళ తీసివేయలేకపోతే ప్రతిరోజూ వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.
  • కప్‌బోర్డుల్లో నాఫ్తలిన్‌ బాల్స్‌ వేసుకోవాలి. దుస్తులు పెట్టే చోట తడి లేకుండా చేయడమే కాకుండా, దుస్తులు తాజాగా ఉండేందుకు నాఫ్తలిన్‌ బాల్స్‌ సహాయపడతాయి. వేపాకులను ఉపయోగించడం వల్ల కూడా తడి దుస్తుల వల్ల వచ్చే వాసన దూరమవుతుంది. 
  • వానాకాలంలో దుస్తులు సరిగ్గా ఆరవు. ఇది చాలామందిని ఇబ్బందిపెడుతుంది. అలాంటప్పుడు ఇండోర్‌ ర్యాక్‌లో ఫ్యాన్‌ పెట్టి దుస్తులు ఆరబెట్టుకోవచ్చు.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST