ఇంటి అలంకరణ ఇలా...

ABN , First Publish Date - 2020-12-28T06:00:59+05:30 IST

ఇంటి అలంకరణ అనగానే ఖర్చుకో కూడుకున్న వ్యవహారం అనుకుంటే పొరపాటు. చిన్నపాటి మార్పులతో సాధారణంగా కనిపించే ఇంటికి ఆకర్షణీయమైన లుక్‌ తెప్పించవచ్చు. ఎలాగంటే...

ఇంటి అలంకరణ ఇలా...

ఇంటి అలంకరణ అనగానే ఖర్చుకో కూడుకున్న వ్యవహారం అనుకుంటే పొరపాటు. చిన్నపాటి మార్పులతో సాధారణంగా కనిపించే ఇంటికి ఆకర్షణీయమైన లుక్‌ తెప్పించవచ్చు. ఎలాగంటే...


  1. ఎంట్రన్స్‌: గుమ్మం తలుపుకు డార్క్‌ బ్రౌన్‌ రంగుకు బదులుగా ఎరుపు, పసుపు, ఆరెంజ్‌... ఇలా ఆకర్షణీయమైన రంగుతో పెయింట్‌ చేయవచ్చు. ఈ రంగులు ఇంట్లో అడుగు పెట్టబోయే అతిధుల కళ్లను కట్టిపడేస్తాయి.
  2. కుర్చీలు, సోఫా: హాల్‌లో ఫర్నిచర్‌ విసిరేసినట్టు పరచడం కాకుండా, ఒద్దికగా అమర్చాలి. సోఫా, దానికి సంబంధించిన కుర్చీలు ఒకేచోట ఉంచాలి. వీటికి హాల్‌లో సౌకర్యవంతమైన స్థానం కల్పించాలి. అలాగే ఫర్నిచర్‌ను గోడవారగా వేస్తే, గది పెద్దదిగా కనిపిస్తుందనేది అపోహ. నిజానికి ఫర్నిచర్‌ గోడకు కొద్దిగా దూరంగా ఉన్నప్పుడే గదికి విశాలమైన లుక్‌ వస్తుంది.
  3. అద్దాలు: అద్దాలు గది ఆకర్షణను రెట్టింపు చేస్తాయి. వెలుగును ప్రతిఫలిస్తూ, గదులను మెరిపిస్తాయి. కాబట్టి ప్రతి గదిలో గోడకు అద్దం వేలాడదీయాలి. ఇలా వేలాడదీసే అద్దాలు కిటికీలకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.
  4. పెయింటింగ్స్‌: వీటిని వేలాడదీసే పద్ధతితో గదికి అందం చేకూరుతుంది. పెయింటింగ్‌ మధ్య భాగం కంటికి ఎదురుగా ఉండే ఎత్తులోనే పెయింటింగ్స్‌ గోడలకు తగిలించాలి. పెద్ద గోడలకు గ్యాలరీ స్టైల్‌లో ఎక్కువ మొత్తంలో చిన్న పెయింటింగ్స్‌ లేదా ఒకే ఒక పెద్ద పెయింటింగ్‌ వేలాడదీయాలి. పెయింటింగ్స్‌ మధ్య రెండు నుంచి నాలుగు అంగుళాల దూరం పాటించాలి. 
  5. కార్పెట్‌: ఫర్నిచర్‌ అడుగున వేసే కార్పెట్‌ ఆ ఫర్నిచర్‌ అందం రెట్టింపు చేసేలా ఉండాలి. ఇందుకోసం సోఫా నాలుగు కాళ్లు, సెంటర్‌ టేబుల్‌ నాలుగు కాళ్లు కార్పెట్‌ మీద పట్టేలా చూసుకోవాలి. లేదా కనీసం సోఫా, కుర్చీల ముందరి రెండు కాళ్లూ పట్టేలా కార్పెట్‌ ఎంచుకోవాలి.
  6. సీలింగ్‌: గది సీలింగ్‌ ఎత్తు తక్కువగా ఉంటే, రూఫ్‌కు తెలుపు రంగు వేయాలి. కిటికీలకు వాటి ఎత్తుకు మించి కర్టెన్లు వేలాడదీయాలి. ఇలా చేస్తే గది ఎత్తుగా కనిపిస్తుంది.

Updated Date - 2020-12-28T06:00:59+05:30 IST