రోడ్డు ప్రమాదాలను నివారించాలి

ABN , First Publish Date - 2021-01-20T05:28:28+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణలకు పోలీసు, రవాణా శాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను నివారించాలి
జిల్లా రవాణాశాఖ ప్రచార రఽథాన్ని ప్రారంభిస్తున్న హోంమంత్రి సుచరిత, డీటీసీ మీరాప్రసాద్‌ తదితరులు

హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు(తూర్పు), జనవరి 19: రోడ్డు ప్రమాదాల నివారణలకు పోలీసు, రవాణా శాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని  హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణాశాఖ రూపొందించిన ప్రచార రథాన్ని మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయం వద్ద హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మ్‌ట్లు, ఫోర్‌ వీలర్‌ వాహనదారులు సీట్‌బెల్టులు తప్పనిసరిగా ధరించేలా చూడాలన్నారు. ప్రభుత్వ చర్యలతో జిల్లాలో వాహన ప్రమాదాలు గత సంవత్సరం కంటే తక్కువుగా నమోదు కావడం మంచి పరిణామం అన్నారు. డీటీసీ మీరాప్రసాద్‌ మాట్లాడుతూ ప్రచారరధం ఫిబ్రవరి 17 వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ వెంకటరెడ్డి, మోటారు వాహనాల తనిఖీ అధికారులు ప్రసాద్‌, శివనాగేశ్వరరావు, రవికుమార్‌, విజయసారఽథి, రాములు, నాగలక్ష్మి, ప్రసన్న, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T05:28:28+05:30 IST