Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది: సుచరిత

విజయవాడ: కొత్తగా నిర్మించిన రెండు పోలీస్ స్టేషన్లను హోం మంత్రి మేకతోటి సుచరిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో విజయవాడలో రెండు పోలీస్ స్టేషన్లు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నూతన భవనాల నిర్మాణం జరిగిందన్నారు. రూ. 2.5 కోట్లతో భవానీపురం, 2.7 కోట్లతో కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లు నిర్మించామన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నంబర్ 1గా ఉందన్నారు. 90 రోజులు నుంచి 42 రోజుల్లో ఛార్జ్ షీటు వేసేలా చేశామని, 90 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. కొత్తగా సచివాలయాల్లో 14 వేల మంది మహిళా పోలీసులను నియమించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట  నూతన భవనాల నిర్మాణం చేపడతామన్నారు. మహిళలకు అన్ని విధాల సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా వినియోగిస్తున్నామని చెప్పారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నామని, వెయ్యి కోట్ల గంజాయి‌ని ఈ మధ్య కాలంలో ధ్వంసం చేశామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

Advertisement
Advertisement