ఆ Tablets పంపినందుకు Amazonపై కేసుకు హోంమంత్రి ఆదేశం

ABN , First Publish Date - 2021-11-27T17:55:44+05:30 IST

ఇప్పటికే డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా సప్లై చేస్తోందంటూ అమెజాన్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఓ యువకుడికి సెల్‌ఫోస్ ట్యాబ్లెట్స్ అందించి అతని చావుకి కారణమైంది.

ఆ Tablets పంపినందుకు Amazonపై కేసుకు హోంమంత్రి ఆదేశం

ఇండోర్ : ఇప్పటికే డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా సప్లై చేస్తోందంటూ అమెజాన్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఓ యువకుడికి సెల్‌ఫోస్ ట్యాబ్లెట్స్ అందించి అతని చావుకి కారణమైంది. ఆదిత్య(18) అనే యువకుడు ఆమెజాన్‌లో సెల్‌ఫోస్ ట్యాబ్లెట్ల కోసం ఆర్డర్ పెట్టగా... వెంటనే అమెజాన్ వాటిని అతనికి అందించింది. అయితే ఆ యువకుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తండ్రి.. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఇండోర్ పోలీసులను ఆదేశించారు.


ఈ-కామర్స్ నెట్‌వర్క్‌ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల విక్రయాలను తనిఖీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమాలను రూపొందిస్తుందని ఇండోర్ ఇన్‌ఛార్జ్ మంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అయిన మిశ్రా చెప్పారు. మిశ్రా గురువారం ఇండోర్‌లో ఉన్నప్పుడు ఆదిత్య తండ్రి వెళ్లి ఆయనను కలిశారు. "ఇటీవల నా కుమారుడు ఆదిత్య, జూలై 22న అమెజాన్ నుంచి నాలుగు ప్యాకెట్ల సెల్‌ఫాస్ ట్యాబ్లెట్‌లను ఆర్డర్ చేశాడు. డెలివరీ అయిన తర్వాత, జూలై 29న మాత్రలు వేసుకుని తదుపరి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు" అని రంజీత్ మిశ్రాకు తెలిపారు. 


ఆదిత్య సెల్‌ఫాస్ ట్యాబ్లెట్ల కోసం ఆర్డర్ చేసినప్పుడు వయస్సు ధ్రువీకరణ పత్రం అడగలేదని వర్మ ఆరోపించారు. తన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. "పాయిజన్ పంపిణీకి సంబంధించి అమెజాన్ కంపెనీపై కేసు నమోదు చేయాలని (స్థానిక పోలీసులను) ఆదేశించాను. అలాగే అమెజాన్ ప్రముఖులకు నోటీసు పంపించమని అధికారులను ఆదేశించాను’’ అని మిశ్రా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకవేళ అమెజాన్ నుంచి ఎవరూ స్పందించకుంటే.. పోలీసులే వారిని దారిలోకి తీసుకొచ్చి చక్కదిద్దాలని రంజీత్ మిశ్రా పోలీసులను ఆదేశించారు.


Updated Date - 2021-11-27T17:55:44+05:30 IST