భైంసా సంఘటనను ఖండించిన హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ

ABN , First Publish Date - 2021-03-09T00:53:33+05:30 IST

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సంఘటనను హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు.

భైంసా సంఘటనను  ఖండించిన హోంమంత్రి  మహ్మద్ మహమూద్ అలీ

హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సంఘటనను హోంమంత్రి  మహ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతోఅదే రోజు రాత్రే ఫోను లో వివరాలుతెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగాఆదేశించారు. భైంసాలో శాంతి సామరస్యాలను కాపాడడానికి అవసరమైన అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని, పోలీసు బలగాలను భైంసాలోని అన్ని సున్నిత మరియు సమస్యాత్మక ప్రాంతాలలో నియమించాలని సూచించారు.


తెలంగాణ డిజిపి తో కూడా మాట్లాడి అన్ని చర్యలను తీసుకోవాలని, భైంసా ఒక సున్నిత ప్రాంతం కాబట్టి, ఇట్టి సంఘటనలు  పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిజిపిని  హోం మంత్రి ఆదేశించారు.భైంసాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు హోంమంత్రి చెప్పారు. సంఘటనలో గాయాల పాలయినవారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆస్తి నష్టం, ఇతర వివరాలను సేకరిస్తున్నారని,ప్రస్తుతం, భైంసా పట్టణంలో ప్రస్తుతం  సెక్షన్ 144 విధించబడిందని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని తెలిపారు. 


సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకున్నామని హోం మంత్రి తెలిపారు. భవిష్యతు లో ఇలాంటి  సంఘటనల నిరోధానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో భైంసా లో పెద్ద సంఖ్యలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తామని హోం మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా, భైంసా  పట్టణ ప్రజలు, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని, పోలీసులకు అల్లర్లకు పాల్పడే లేదా ప్రేరేపించే వారి సమాచారం ఉంటే అందించి, శాంతి కి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-03-09T00:53:33+05:30 IST